Headlines

కంట్రోల్ రూం , ఎంసిఎంసీ మీడియా కేంద్రాన్ని, పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి రంజన్ కుమార్ విక్రమ్, కే. గోపాల కృష్ణ, జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్.

పత్రికా ప్రకటన

తేది:14.11.2023

నిర్మల్ జిల్లా మంగళవారం

 

కంట్రోల్ రూం , ఎంసిఎంసీ మీడియా కేంద్రాన్ని, పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి రంజన్ కుమార్ విక్రమ్, కే. గోపాల కృష్ణ, జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్.

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన యం.సి.యం.సిమీడియా సెంటర్, కాల్ సెంటర్ లను మంగళవారం ఎన్నికల పరిశీలకులు రవిరంజన్ కుమార్ విక్రమ్, కే. గోపాల కృష్ణ లు జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ తో కలసి. పరిశీలించారు.

ఈ సందర్భంగా పరిశీలకులు

కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన సివిజీల్, 1950 టోల్ ఫ్రీ నెంబర్, సువిధ, చెక్ పోస్ట్ లోకేషన్స్, సర్వెలేన్స్ వెబ్ కాస్టింగ్ ల పై క్షుణ్ణంగా పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సి విజిల్, సువిధ లకు సంబందించి ఆన్ లైన్ రిపోర్ట్ ను పరిశీలించారు.

 

అనంతరం మీడియా కేంద్రాన్ని పరిశీలించి. లోకల్ ఛానల్, టెలివిజన్ లలో ప్రసారమయ్యే కార్యక్రమాల ను పరిశీలించారు.

 

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా పౌర సంబంధాల అధికారిణి తిరుమల, కంట్రోల్ రూం, నోడల్ అధికారి సందీప్, సి విజిల్ నోడల్ అధికారి మోహన్ సింగ్, DPRO సిబ్బంది, కంట్రోల్ రూమ్ సిసి కెమెరా ఆపరేటర్ ముత్యం, GPS వెహికల్ ఆపరేటర్ నరేశ్, fst టీం

మానటరింగ్ ఆపరేటర్ నవతేజ తదితరులు పాల్గోన్నారు.

 

జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.