Headlines

మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కొండపాక మండల బిఆర్ఎస్ నాయకులు..

ఈరోజు కొండపాక మండల భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కొండపాక మండల మాజీ రైతుబంధు కోఆర్డినేటర్ రాగల దుర్గయ్య, తెలంగాణ జాగృతి కార్యదర్శి అనంతుల ప్రశాంత్, ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ అనంతుల పద్మ, మాజీ ఎంపీపీలు బొద్దుల కనకయ్య, బైరెడ్డి రాధా కిషన్ రెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు పెద్దఅంకుల శ్రీనివాస్ గౌడ్, బూర్గోజు బాల బ్రహ్మం తో పాటు కొండపాక మండల అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మాజీ మంత్రివర్యులు *తన్నీరు హరీష్ రావు గారిని* కలిసి భారీ మెజార్టీతో ఏడవసారి విజయం సాధించినందుకు హరీష్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

 

ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు *హరీష్ రావు గారు* మాట్లాడుతూ కొండపాక మండలంలో బారాస పార్టీ కార్యకర్తలు అందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని,

 

ఆపద సంపదలో భాగస్వామ్యం అవుతామని,

అందరూ ధైర్యంగా ఉండి ప్రజలకు అండగా ఉండాలని తెలిపారు.

 

గజ్వేల్ నియోజకవర్గం లో భారీ మెజార్టీతో కేసిఆర్ గారిని గెలిపించడం పట్ల కొండపాక మండల నాయకులు అందరికీ మాజీ *మంత్రివర్యులు హరీష్ రావు* *గారు* ప్రత్యేక *శుభాకాంక్షలు* తెలియజేశారు…..