Headlines

వెట్టి చాకిరి నిర్మూలన దినోత్సవ కార్యక్రమం…

 

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, ఫిబ్రవరి 9:

 

వెట్టి చాకిరీ నిర్మూలన దినోత్సవం కార్యక్రమాన్ని మండల న్యాయ సెవాధికార సంస్థ మరియు కార్మిక శాఖ సంయుక్తంగా శుక్రవారం స్థానిక చినరంగని పాలెం లో ఉన్న కార్మిక శాఖ కార్యాలయంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు కార్మిక శాఖ జిల్లా ఇంఛార్జి అధికారి ఎ. లక్ష్మి అధ్యక్షత వహించగా, సీనియర్ న్యాయవాదులు సి. జ్వాల శ్రీనివాస్ మరియు వి.వి సుబ్బారావు లు పాల్గొని కార్మిక చట్టాలు, 1976 లో వచ్చిన వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం ప్రకారం నిబంధనలను ఉల్లంఘించిన యజమానులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కార్మికులకు అడ్వాన్సులు ఇచ్చి, వారికి కనీస వేతనాలు చెల్లించకుండా పనిలో నియమించరాదని, శుభ్రమైన త్రాగునీరు, వారాంతరం సెలవు దినం తప్పనిసరిగా ఉండాలన్నారు. చట్టపరమైన ఉచిత న్యాయ సహాయం కూడా పొందవచ్చునని తెలిపారు. కార్మిక శాఖ ఇంఛార్జి అధికారి ఆకన లక్ష్మి మాట్లాడుతూ ప్రమాదకరమైన వృత్తులుగా గుర్తించబడిన ఇటుకల బట్టీలు, స్టోన్ క్రషర్, హోటల్ డాబాలు , మెకానిక్ షాప్ లు వెట్టి చాకిరీ కి నిదర్శనంగా ఉన్నాయన్నారు. హాజరైన వారందరితో వెట్టి చాకిరి నిర్మూలన కొరకు నిర్దేశిత ప్రమాణం చేయించడం జరిగిందన్నారు. సోషల్ వర్కర్ సిహెచ్. రంగారావు, పి.ఎల్.వి కమల్ రాజు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ , మెడికల్ అసోసియేషన్ సభ్యులు, వివిధ ఇటుక బట్టీల యజమానులు హాజరైనారు.