Headlines

జయజయహే తెలంగాణా.. ఏపీ వర్సెస్ తెలంగాణా..

జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వ గీతంగా నిర్ణయించి విడుదల చేయాలని భావించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ గీతాన్ని స్వరపరచడానికి సంగీత దర్శకుడు కీరవాణికి అవకాశం ఇవ్వడం పట్ల తెలంగాణ రాష్ట్రంలో దుమారం మొదలైన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన కీరవాణి కంపోజ్ చేసేందుకు ఇవ్వడం పట్ల తెలంగాణ మ్యూజిషియన్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

 

కీరవాణి తెలంగాణా రాష్ట్ర గీత వివాదం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని మార్చుకోకపోతే చారిత్రక తప్పిదంగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ సైతం రాసింది. అయినప్పటికీ జయ జయహే తెలంగాణ గీతాన్ని సంగీతదర్శకులు కీరవాణినే స్వరపరచడానికి రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరిగిన పోరాటాన్ని, తెలంగాణప్రాంత ఉద్యోగాలు తమకే కావాలని నినాదాన్ని మరచి ఆంధ్రప్రాంతానికి చెందిన కీరవాణికి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని స్వరపరచడానికి ఇవ్వడం పైన రాష్ట్రవ్యాప్తంగా వివాదం చెలరేగింది.

కీరవాణికి మద్దతుగా వాదన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని తెలంగాణ సంగీత దర్శకులు అత్యద్భుతంగా రూపొందించగలరని, తెలంగాణ కళాకారులు బృందగీతంగా పాడగలరని, కీరవాణి స్వరపరిస్తే ఒప్పుకోబోమని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న వేళ, ఈ గీతాన్ని స్వరపరచడానికి సంగీత దర్శకుడు కీరవాణికి అవకాశం ఇవ్వడం పట్ల ఆయన మద్దతు ధరలు కూడా తమదైన వాదన వినిపిస్తున్నారు. 30ఏళ్లకు పైగా తన సంగీత ప్రస్తానాన్ని హైదరాబాద్లోనే కొనసాగిస్తున్న ఆస్కార్ విజేత కీరవాణి ఈ పాటను స్వరపరచడానికి అర్హుడని వారంటున్నారు.

 

కళలకు, కళాకారులకు ప్రాంతీయతనా ఆయన ఏనాడు తన మూలాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు వెళ్లాలని ఆలోచన కానీ, ఆ దిశగా చర్యలు కానీ చేయలేదని చెబుతున్నారు. కళలకు, కళాకారులకు ప్రాంతీయత ఆపాదించరాదు అని కొంతమంది ఆయన మద్దతుదారులు సూచిస్తున్నారు. అంతేకాదు కీరవాణి కి తెలంగాణ ప్రాంత పాటలతోనూ అనుబంధం ఉందని పీపుల్స్ ఎన్కౌంటర్ కు తెలంగాణ ప్రాంత నేపథ్యంతో అద్భుతమైన పాటలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.

 

ప్రాంతాన్ని బట్టి కళాకారులను చూస్తారా? అంతేకాదు లాలూ దర్వాజా లష్కర్ బోనాలు పండుగకొస్తనని రాకపోతివి అంటూ ఇప్పటికీ ఎవరూ మర్చిపోకుండా తెలంగాణ బాణీలో సాగిన పాట కీరవాణి చేసినదేనని చెబుతున్నారు. కళాకారుడికి ఒక ప్రాంతాన్ని బట్టి గుర్తింపు ఉండదని అలా చూస్తే ఆస్కార్ కూడా ఆయన టాలెంట్ కు ఇచ్చినదని చెబుతున్నారు. అనవసరపు రాద్ధాంతం మంచిది కాదని కీరవాణి తరపు మద్దతుదారులు అంటున్నారు.

 

పట్టు వీడని తెలంగాణా కళాకారులు.. వివాదంలో కీరవాణి సంగీతం అయితే తెలంగాణ రాష్ట్ర గీతం విషయాల్లో మాత్రం తెలంగాణ మ్యూజిషియన్స్ అసోసియేషన్ తమ పట్టు వీడడం లేదు. ఇక తాజాగా కీరవాణి వ్యవహారంలో రాజకీయ రంగు కూడా పులిముకోవడంతో పరిస్థితి ఎటు దారితీస్తుంది అనేది మాత్రం అర్థం కాకుండా ఉంది. మొత్తానికి ఆంధ్ర తెలంగాణ వివాదంలో కీరవాణి సంగీతం నలిగిపోతుంది.