Headlines

షాకింగ్ ఆధారాలతో కవిత సాధారణమహిళ కాదన్న ఈడీ, సీబీఐ..!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ ల్యాండరింగ్ ఆరోపణలతో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం శత విధాల ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నిన్న కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగగా కవితకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ తమ వాదనలను వినిపించింది. ఈ వాదనలలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 

రెండు రోజుల్లో నాలుగు ఫోన్లు ఫార్మాట్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఏం చేశారో ఈడి, సిబిఐ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.ఎమ్మెల్సీ కవిత సాక్షులను బెదిరించడం తో పాటు, సాక్ష్యాలను జరిపి వేసే ప్రయత్నం చేశారని అందువల్ల ఆమెకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ, సిబిఐ తరపు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టుకు వివరించారు. కవితకు ఈ డి సమన్లు జారీ చేసిన రెండు రోజుల్లోనే ఆమె నాలుగు ఫోన్లను ఫార్మాట్ చేశారని పేర్కొన్నారు.

 

కవిత సాధారణ మహిళ కాదు కవిత సాధారణ మహిళ కాదని పేర్కొన్న ఈడి రాజకీయ శక్తిసామర్ధ్యాలు ఉన్న వ్యక్తని, ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన వ్యక్తి కూతురని పేర్కొన్నారు. విదేశాలలో ఫైనాన్స్ లో మాస్టర్స్ చేసి వచ్చి, రాజకీయాలలో ఉన్నత స్థానాలను చేపట్టిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఈ కేసులో బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై లను బెదిరించి తనకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాలను ఉపసంహరించుకునేలా కవిత ఒత్తిడి చేశారని ఈడి కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది.

 

కవితపైన ఇచ్చిన వాంగ్మూలం మాత్రమే ఉపసంహరించుకున్న రామచంద్ర పిళ్ళై కవిత బినామీగా వ్యవహరించిన రామచంద్ర పిళ్ళై ఈ కేసులో 2022లో కవిత పాత్ర గురించి ఇచ్చిన వాంగ్మూలాన్ని 118 రోజుల తర్వాత ఉపసంహరించుకున్నట్టు, కవిత ఒత్తిడితోనే ఈ పని చేసినట్టు వారు కోర్టుకు విన్నవించారు. ఈడీ తనను బెదిరించి అనుచితంగా వ్యవహరించి వాంగ్మూలం నమోదు చేసిందని చెప్పి ఆయన తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నట్టు చెప్పారని ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక కవితనే ఉన్నదని వారు కోర్టులో తెలిపారు.

 

ఢిల్లీ లిక్కర్ స్కాం సంపాదన ఇలా ఈడీ ముందు అరుణ్ రామచంద్ర పిళ్ళై ఎన్నో వాంగ్మూలాలు ఇచ్చినా కేవలం కవితపై ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నారు అని దీని వెనుక కవిత పాత్ర ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ కుంభకోణం సాగిన 10 నెలల కాలంలో హోల్సేల్ వ్యాపారులు మొత్తం 338 కోట్ల రూపాయలు నేరపూరితంగా ఆర్జించారని, అందులో ఇండో స్పిరిట్ సంస్థకు 192 కోట్ల రూపాయలు దాకా దక్కాయన్నారు.

 

కవితకు ఆ డబ్బు చేరినట్టు వాట్సప్ చాట్స్ ఇదే సంస్థలో కవిత బినామీగా ఉన్న రామచంద్ర పెళ్లై కవిత బినామీగా ఉంటూ ఆమె తరపున 32 కోట్లు పొందారని, ఈ విషయం కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలంలో చెప్పారని తెలిపారు. ఇక 32 కోట్లలో 4.50కోట్లు కవిత ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియా అహెడ్ సంస్థకు వెళ్లాయని, అందుకు సంబంధించిన whatsapp చాట్స్ కూడా ఉన్నాయని తెలిపారు.

 

క్రింది కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వని కారణం ఇదే గతేడాది మార్చి 21వ తేదీన దర్యాప్తు సంస్థలకు 9 ఫోన్ లను అప్పగించిన కవిత అందులో నాలుగు ఫోన్లను ఫార్మాట్ చేశారని ఎఫ్ఎస్ఎల్ నివేదిక కూడా ఉందని పేర్కొన్నారు. ఆమె సాక్షాలను తారుమారు చేస్తున్న కారణంగానే కింది కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వలేదని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని కవితకు బెయిల్ ఇవ్వద్దని ఈడి మరియు సిబీఐ తరపు లాయర్లు కవిత కేసులో తమ వాదనలు వినిపించారు.