Headlines

సాయంత్రం సమయంలో టీ అందరూ తాగొచ్చా? లేదా?

న భారతదేశంలో టీ(Tea) తాగేవారు చాలామంది ఉంటారు. అయితే అందరూ కూడా టీ తాగడం మంచిది కాదు. ఎలాంటి అనారోగ్యం లేనివారు టీని రోజులో ఏ సమయంలోనైనా తాగవచ్చు.

ఇతర దేశాలలో ఎక్కువగా బ్లాక్ టీ తాగుతారు. కానీ మన దేశంలో టీని పాలు(Milk), పంచదార(Suger) కలిపి తయారు చేస్తారు. కాబట్టి సాయంత్రం సమయంలో టీ తాగడం మంచి పద్దతి కాదు. ఎందుకంటే సాయంత్రం సమయంలో టీ తాగడం వలన అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి.

ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనివారు, నిద్ర లేమి సమస్య లేనివారు, నైట్ షిఫ్ట్ జాబ్స్ చేసేవారు, ప్రతిరోజూ సమయానికి భోజనం చేసేవారు, టీ తాగేటప్పుడు అర కప్పు మాత్రమే లిమిటెడ్ గా తాగేవారు సాయంత్రం సమయంలో టీని తాగవచ్చు. గ్యాస్ సమస్య ఉన్నవారు, ఆకలి తక్కువగా ఉన్నవారు, బరువు పెరగాలి అనుకునేవారు, మంచి జుట్టు, ఆరోగ్యకరమైన చర్మం కావాలని అనుకునేవారు సాయంత్రం సమయంలో టీ తాగకూడదు. టీ తాగాలి అనుకునేవారు రోజుకు ఒక కప్పు టీ తాగవచ్చు అంతకంటే ఎక్కువ టీ తాగితే మనకు ఆరోగ్యకరమైన సమస్యలు వస్తాయి.

టీ ఎక్కువగా తాగడం వలన డీహైడ్రాషన్ వంటి సమస్యలు వస్తాయి. టీ సాయంత్రం సమయంలో తాగడం వలన కాలేయం దెబ్బతింటుంది, ఎముకలు దృఢత్వం తగ్గుతుంది. టీ ఎక్కువగా తాగడం వలన మన శరీరంలో ఐరన్ స్థాయిలు తగ్గుతాయి. పని ఒత్తిడి తగ్గడానికి, అలసట తగ్గడానికి, తలనొప్పి తగ్గడానికి చాలామంది ఎక్కువగా టీ తాగుతుంటారు. కానీ మామూలు టీ కంటే గ్రీన్ టీ తాగడం మంచిది దీనివలన ఎటువంటి ఆరోగ్యకరమైన ఇబ్బందులు రావు. కాబట్టి టీ తాగాలనుకునేవారు కొద్దిగా తాగాలి. అంతేగాని రోజుకు రెండు మూడు సార్లు తాగకూడదు.