Headlines

ప్రతి ఇంట సంక్షేమ పథకాల పంట.

ప్రతి ఇంట సంక్షేమ పథకాల పంట.
— గడప గడపకూ నవరత్న కాంతులు.
— కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వ ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు పొందుతుండడంతో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని కొత్తపేట ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చెముడులంక సచివాలయం-2లో మండల వైకాపా కన్వీనర్ ఆ గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాసుతో కలిసి మూడవరోజు గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. సచివాలయం-2లో 8 సంక్షేమ పథకాలకు సంబంధించి రూ.76.24 లక్షలతో అభివృద్ధి నిర్మాణాలు, నవరత్నాల్లో భాగంగా 16 పథకాలకు సంబంధించి రూ.6.13 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఆ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న మురుగునీరు పోయేందుకు మెయిన్ డ్రైను సుమారు రెండు కిలోమీటర్లు మేర రూ.2.50 కోట్లుతో నిర్మించిన ఎమ్మెల్యే చిర్లకు గ్రామ ప్రజలు రుణపడి ఉంటారని సర్పంచ్ తమ్మన అన్నారు. అనంతరం రూ.40 లక్షలతో నూతనంగా నిర్మించిన సచివాలయం-2 భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి గ్రామంలో గడప గడపకు పర్యటిస్తూ ఇంటింటికి అందుతున్న సంక్షేమ పథకాలు ప్రభుత్వ పాలన తీరుపై ప్రజాభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, ఆసరా, అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన వంటి పథకాలు అందుతున్నది లేనిది ఆరాతీశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళుతుంటే ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకం అందడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అవినీతి, లంచగొండితనం లేకుండా నేరుగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు సకాలంలో అందిస్తుండడంతో ముఖ్యమంత్రి జగనన్న పాలనపై ప్రజలు వర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. వైయస్సార్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఇచ్చిన హామీలను 98 శాతము నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. గ్రామంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే చిర్లకు అడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు మంగళహారతులుతో స్వాగతం పలికి పూల మాలలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, దొండపాటి వెంకటేశ్వరరావు (బులిరెడ్డి), డాక్టర్ చల్లా ప్రభాకర రావు, దూలం రామలింగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు తమ్మన భాస్కరరావు, దూలం సత్తిబాబు, యనమదల నాగేశ్వరరావు, నాగిరెడ్డి సత్యనారాయణ, అడబాల వీర్రాజు, తోరాటి రాంబాబు, దొండపాటి చంటి, బుడ్డిగ వీరవెంకట్రావు, దొండపాటి శ్రీను, రాయుడు వెంకటేష్, సుంకర శ్రీనివాసులు, మోటూరి సురేష్, తమ్మన హరిహర కుమార్, అడబాల వెంకట్రావు, మద్దిరెడ్డి వెంకన్నబాబు, సుంకర కామరాజు, ఎంపీడీవో జాన్ లింకన్, తాసిల్దార్ ఐపీ శెట్టి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పోసమ్మ, ఇంచార్జ్ హౌసింగ్ ఏఈ జేజిబాబు, పంచాయతీ కార్యదర్శి యు రేణుక, పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు.