Headlines

అమృత్ భారత్ పథకంలో పలు రైల్వే టేషన్లు సుందరీ కరణ

అమృత్ భారత్ పథకంలో పలు రైల్వే టేషన్లు సుందరీ కరణ

– జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఈతకోట భీమశంకరరావు
(తాతాజీ)

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఆగస్ట్ 4 :

దేశ చరిత్ర లో ఎన్నడూ లేనివిధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం
అమృత్ భారత్ పథకంలో పలు రైల్వే స్టేషన్ల సుందరీకరణకు రూ.500 కోట్లకు పైగా నిధులు కేటాయించడం ప్రశంసనీయమని జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఈతకోట భీమశంకరరావు (తాతాజీ) అన్నారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ధన రెసిడెన్సి లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ ప్రముఖ వ్యాపార వాణిజ్య కేంద్రం గా ఉన్న తాడేపల్లిగూడెం విద్యారంగంలో ను ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ప్రయాణీకులకు మరింత మెరుగైనసేవలందించేందుకు తాడేపల్లిగూడెం స్టేషన్ అభివృద్ధి కోసం కు రూ.27.13 కోట్లు నిధులు కేంద్రం కేటాయించిందన్నారు. దీనికి సంబంధించి సూచనలు చేయాలని స్థానిక నాయకత్వాన్ని కోరినట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నుంచి ఏడెనిమిది జిల్లాల నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తారన్నారు.టూ టౌన్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్లో రెండో టిక్కెట్ బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. వోవర్ బ్రిడ్జి నుంచిరైల్వే గూడ్స్ షెడ్ మార్గం అద్వానంగా తయారైందని, 500 నుంచి 600 మీటర్ల మేర సిమెంట్ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించామన్నారు. గతంలో గూడ్స్ షేడ్ లోపలి వైపు సీసి రోడ్ పాక్షికంగా నిర్మాణం చేశారని చెప్పారు.అలాగే, రైల్వే స్టేషన్ పరిధిలోని పాడు పడిన 4ఎకరాల చెరువుభూమిని శుభ్రం చేసి షాపింగ్ మాల్స్,కమర్షియల్ కాంప్లెక్స్ గా అభివృద్ధి చేస్తే కేంద్రానికి ఆదాయం వస్తుందన్నారు. రైల్వేస్టేషన్లో ఏ సి అప్పర్ క్లాస్ లాంజి, డార్మి ట రి విశ్రాంతి భవన నిర్మాణo చేయాలని సూచించామన్నారు. వందే భారత్ తో సహా 14 రైళ్ల హాల్ట్ కల్పించాలని కోరామన్నారు. రైల్వే స్టేషన్ లో సుందరీకరణ పనులకు ఈ నెల ఆరవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారన్నారు. ఇందుకు సంబంధించి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో ఆ రోజు ఉదయం 9 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజకీయ పార్టీలకతీతంగా అందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.కాగా, గూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు కేటాయించిన ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లకు తాతాజీ కృతజ్ఞతలు తెలిపారు. వినతి పత్రాల లో వివరాలను బిజెపి పట్టణ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి వివరించారు.ఈ సమావేశంలో బిజెపి నాయకులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అడపా రమేష్, ఓ బిసి మో ఆర్చ్ రాష్ట్ర కార్యదర్శి ఐనం బాలకృష్ణ,జిల్లా ఉపాధ్యక్షు లు నరిసే సోమేశ్వర రావు, కొండపల్లి నగేష్, పట్టణ బిజెపి అధ్యక్షుడు ముప్పిడి సురేష్ రెడ్డి, అమృత్ భారత్ కార్యక్రమ ఇంఛార్జి చిట్యాల రాంబాబు, ఎస్సీ మార్చ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి అర్ వి ఎల్ నారాయణ, వోబిసి మార్చ కార్యదర్శి మరీసెట్టి నరసింహ మూర్తి, వన్నెం రెడ్డి నవీన్,దత్తు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.