Headlines

క్రీడల్లో రాణిస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు..

 

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 22:

 

విద్యతోపాటు క్రీడల్లో రాణిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని దడగర్ర జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.హెచ్ చంద్రశేఖర్ అన్నారు. ఇటీవల పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని ప్రతిభ సాధించిన 9వ తరగతి చదువుతున్న ఊబా వెంకటేష్ను ఉపాధ్యాయులు బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యతోపాటు ఎంచుకున్న క్రీడా రంగంలో విజయం సాధించేవరకు కృషి పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. క్రీడల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులకు పాఠశాల తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. క్రీడల్లో రాణిస్తే చదువుకున్న పాఠశాల, తల్లిదండ్రులకు ఉ పాధ్యాయులతోపాటు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రతీ రోజు కొంత సమయం క్రీడలు, వ్యాయామం, యోగా చెయ్యడం ద్వారా మానసిక వత్తిడి నుండి విముక్తి లభిస్తుందన్నారు. శారీరక, మానసిక ధృఢత్త్వం కొరకు ప్రతీ విద్యార్ధి క్రీడా పోటీల్లో పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో రాణిస్తే ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలు సులభంగా లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తోటి విద్యార్ధులు, తల్లిదండ్రులు, సిబ్బంది, గ్రామస్తులు వెంకటేషు అభినందించారు.