Headlines

మాధవిని సన్మా నించిన అంబేద్కర్ కాలనీవాసులు..

బూర్గంపాడు 14 న్యూస్ నైన్

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం బూర్గంపాడు లోని అంబేడ్కర్ కాలనీకి చెందిన కేశపాక భూషణం,వెంకటమ్మ దంపతుల కుమార్తె కేసు పాక మాధవి, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నర్సింగ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది. ఈమె కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా వైద్య కళాశాలలో నర్సింగ్ ఆఫీసర్గా ఉద్యోగ బాధ్యతలు మాధవి స్వీకరించింది. ఈ సందర్భంగా మండల కేంద్రమైన బూర్గంపాడు అంబేద్కర్ కాలనీవాసులు ప్రభుత్వ ఉద్యోగం సాధించిన మాధవికి ఘనంగా సన్మానించి సత్కరించారు.

నిరుపేద కుటుంబంలో జన్మించిన మాధవి అనేక ఇబ్బందులు కష్టాలు ఎదురవుతున్న ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని లక్ష్యంతో కష్టపడి ఉద్యోగం సాధించింది. కేసు పాక భూషణం, వెంకటమ్మ దంపతులకు నలుగురు సంతానం. సంతానంలో మూడో కుమార్తె మాధవి, ఈమె ఒకటవ తరగతి నుండి జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాల యందు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యాభ్యాసం సాగించింది, ఎర్రపాలెం మండలంలోని టీఎస్ ఆర్ జె సి ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. అనంతరం హైదరాబాదు లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో బిఎస్సి నర్సింగ్ , ఎమ్మెస్ నర్సింగ్ పూర్తి చేసింది, ఇటీవల ఉద్యోగ అవకాశ పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి, ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకున్నది.

కష్టపడుతూ ఇష్టంగా చదువుకుంటే ఫలితం వస్తుంది అనడానికి మాధవి ఆదర్శం.

అంబేద్కర్ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ మాధవిని పూలమాలతో శాలువాతో సత్కరించారు. అదేవిధంగా యువజన నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువతకు విద్యార్థులకు మాధవి ఆదర్శంగా నిలుస్తుంది అని అన్నారు. చదువులకు పేదరికం అడ్డు కాదని ఇబ్బందు లు, ఎన్ని ఎదురైనా అనుకున్న లక్ష్యం కొరకు సాధన చేసినప్పుడు, కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా లభిస్తుందని అన్నారు. మాధవిని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేసు పాక పుల్లయ్య, కేసు పాక రఘురాం, కేసుపాక డా మహేష్, రాజేష్ శంకర్రావు, ప్రసాదు, నాగరాజు ,శ్రీను, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.