Headlines

సాకేతపురి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు..

బూర్గంపాడు 2 న్యూస్ 9

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాకలోని సాకేతపురి ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామికి ఉదయం నుండి అభిషేకము, వస్త్రాలంకరణ ,అష్టోత్రము, ఆకుపూజ ,హనుమాన్ చాలీసా వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఆంజనేయ స్వామి సన్నిధికి రావడం, స్వామిని పూజించడం ఎంతో సంతోషంగా ఉందని ,ఆ స్వామి దయవల్ల మాకు అంతా మంచే జరిగిందని అదేవిధంగా ఆ ఆంజనేయస్వామి భక్తులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో సాకేతపురి ఆంజనేయ స్వామి సేవ సమితి సభ్యులు ,సాకేతపురి హనుమాన్ చాలీసా భక్త బృందం ,గ్రామ ప్రజలు ,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.