Headlines

…….మూడు రోజుల పాటు లిక్కర్ విక్రయాలు బంద్

ఢిల్లీలో మూడు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు లిక్కర్ విక్రయాలు బంద్ కానున్నాయి. ఈ నెల 4వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి డిసెంబరు 4వ తేదీన సాయంత్రం 5.30 గంటల వరకు మద్యం షాపులతో పాటు వాటి అనుబంధ బార్లు, సేల్ ఔట్‌లెట్స్‌లు…

Read More

రాబోయే ఎన్నికల్లో జనసేన(Janasena)తోనే బీజేపీ పొత్తు : విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్

రాబోయే ఎన్నికల్లో జనసేన(Janasena)తోనే బీజేపీ పొత్తు అని.. విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ అన్నారు. పవన్(Pawan)​తోనే ముందుకెళ్తామన్నారు. రాజమహేంద్రవరంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జు​ల సమావేశంలో మురళీధరన్​ పాల్గొన్నారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వడం లేదని మురళీ ధరన్ అన్నారు. ఈ కారణంగా ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘ఏపీ అభివృద్ధికి బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మూడు లక్షల కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ పనులు చేపట్టాం….

Read More

హైద్రాబాద్‌లో ఎన్ఎస్ఎ అజిత్ దోవల్ రహస్య పర్యటన….కొందరు కీలక వ్యక్తులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారట

జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఎ) అజిత్ దోవల్, హైద్రాబాద్‌లో అత్యంత రహస్యంగా పర్యటించారు. దాదాపు మూడు గంటలపాటు ఈ పర్యటన జరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా అజిత్ ధోబాల్ పర్యటన అంటే, నిఘా వర్గాలకు సమాచారం వుంటుంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగానికీ ఖచ్చితమైన సమాచారం ఇస్తారు. కానీ, అస్సలేమాత్రం ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైద్రాబాద్ వచ్చారు అజిత్ ధోబాల్. మూడు గంటలపాటు హైద్రాబాద్‌లో.. దాదాపు మూడు గంటలపాటు హైద్రాబాద్‌ లోని వివిధ ప్రాంతాల్లో…

Read More

బెంగళూరులో మరో సామూహిక అత్యాచారం

దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న హైదరాబాదులో తోటి విద్యార్థులచేత పదవ తరగతి విద్యార్థిని సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవరక ముందే.. బెంగళూరులో మరో సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 22 ఏళ్ల బాలికపై బైక్ సేవలను అద్దెకు తీసుకున్న తర్వాత రాపిడో బైక్ డ్రైవర్, అతని స్నేహితుడు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు గుర్తించారు. 22 ఏళ్ల కేరళ యువతి మద్యం మత్తులో తన స్నేహితుడి ఇంటికి…

Read More

జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాధ్ జిల్లాలో ముస్లిం మతపెద్దలు సంచలన నిర్ణయం

జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాధ్ జిల్లాలో ముస్లిం మతపెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముస్లిం ఇళ్లలో జరిగే వివాహాల్లో డ్యాన్సులు, మ్యూజిక్ పార్టీలపై నిషేధం విధించారు. ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే మాత్రం రూ.5100 అపరాధం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పైగా, రాత్రి 11 గంటలత ర్వాత నిఖా జరిపించినా జరినామా తప్పదని తేల్చి చెప్పారు. డాన్సులు, మ్యూజిక్ పార్టీలు ఇస్లామ్ మత సంప్రదాయానికి విరుద్ధమని మత పెద్దలు స్పష్టం చేశారు. నిర్సా బ్లాక్‌లోని సిబిలిమడీ జామా మసీదు ప్రధాన…

Read More

యోగా గురువు బాబా రాందేవ్ మహిళలకు సారీ చెబుతూ బహిరంగ లేఖ విడుదల

మహిళల వస్త్రాధారణపై ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి పెను దుమారాన్నే రేపాయి. అనేక మంది రాజకీయ నేతలు, మహిళా సంఘాల ప్రతినిధులు రాందేవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పైగా, మహారాష్ట్ర మహిళా కమిషన్ రాందేవ్‌కు నోటీసులు కూడా జారీచేసింది. దీంతో ఆయన దిగివచ్చి, ఒక బహిరంగ క్షమాపణ లేఖను కూడా జారీచేశారు. మహిళలను తనలాగా దుస్తులు వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు అంటూ రాందేవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి….

Read More

బీమా ఏజెంట్ల,బ్రోకర్లు కమిషన్లపై పరిమితి ఎత్తివేత?

బీమా రంగంలో ఏజెంట్లు, బ్రోకర్లు వంటి మధ్యవర్తులకు చెల్లించే కమీషన్లపై ఎత్తివేసేందుకు రంగం సిద్ధమైంది. కమీషన్ చెల్లింపులకు సంబంధించి ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (IRDAI) ఇవాళ ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది, ఇపుడు కమీషన్ చెల్లింపుపై ఉన్న పరిమితిని తొలగించాలని ప్రతిపాదించారు.అయితే ఈ కమీషన్ ద్వారా చెల్లించే మొత్తాన్ని సంస్థ నిర్వహణ ఖర్చులో భాగంగా పరిగణిస్తామని ఐఆర్‌డీఏ పేర్కొంది. ఇదే సమయంలో IRDAI మరొక ముసాయిదా మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. దీని ప్రకారం…

Read More

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దుస్తుల విషయంలో చాలా శ్రద్ధ

పూర్వం మనుషులు బట్టలు వేసుకునే వారు కాదు. కాలక్రమంలో ఆకులు కట్టుకునేవారు. తరువాత బట్టలు నేయడం తెలుసుకుని నాగరికత కూడా నేర్చుకున్నాడు. దీంతో రకరకాల బట్టలు తయారు చేయడం తెలుసుకున్నాడు. ప్రస్తుతం బట్టలు వేసుకోవడం ఓ ఫ్యాషన్ గా చూస్తున్నారు. మనం వేసుకునే దుస్తులే మన స్థాయిని సూచిస్తాయి. మనం వేసుకునే బట్టలను బట్టి మన స్థాయి తెలుస్తుంది. రాజకీయ నేతలు ఒకలా, వ్యాపారస్తులు మరోలా, సామాన్యులు ఇంకలోలా దుస్తులు వేసుకోవడం మామూలే. మన ఆహార్యం మనం…

Read More

రాజీవ్‌ సక్సేనాతో పాటు ఆయన భార్యను కూడా ఈడీ అధికారులు అరెస్ట్‌

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సెస్మిక్‌ సర్వే కంపెనీ ఆల్ఫాజియో (ఇండియా)కు చెందిన రూ. 16 కోట్ల విలువైన ఫిక్సెడ్‌ డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది. ఫెమా చట్టం కింద ఈ జప్తు చేసింది. కంపెనీకి రావాల్సిన మొత్తాన్ని ఫెమా నిబందనలకు విరుద్ధంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో దాచినట్లు ఈడీ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. దేశంతో పాటు విదేశాల్లో కూడా గ్యాస్‌, చమరు అన్వేషణ, ఉత్పత్తి చేసే కంపెనీలకు ఆల్ఫాజియో తన…

Read More

. సమాధి నుంచి మూడో రోజు తిరిగొస్తా అంటున్న పాస్టర్‌.

ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానం పరుగులు పెడుతుంటే.. మరోవైపు విఙ్ఞాన రంగంలో దేశం నింగిలోకి దూసుకెళ్తుంటే.. ఇంకా మూఢ నమ్మకాలను పట్టుకుని కొంతమంది వేలాడుతూనే ఉన్నారు. మత విశ్వాసాలు మనిషిలో మంచిని పెంచాలేగాని మూఢత్వం వైపు నడిపించరాదని జన విఙ్ఞాన వేదిక వంటి సంఘాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. తాజాగా ఓ పాస్టర్‌ విచిత్ర వాదన అందరినీ పరేషాన్‌కు గురిచేస్తోంది. తాను పది రోజుల్లో చనిపోయి.. సమాధి నుంచి మూడో రోజు తిరిగి వస్తానని చెప్పడం వింత అనిపించినా నమ్మకం…

Read More