Headlines

రిజిస్ట్రేషన్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోండి : జిల్లా జాయింట్ కలెక్టర్

 

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, అక్టోబర్ 19:

సచివాలయం ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిన రిజిస్ట్రేషన్లు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డి అన్నారు.గురువారం స్థానిక కలెక్టరేట్ జిల్లా జాయింటు కలెక్టరు ఛాంబరు నందు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియపై జిల్లా రిజిస్ట్రారు, సబ్ రిజిస్ట్రార్లులతో సమావేశాన్ని జిల్లా జాయింటు కలెక్టరు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడానికి సచివాలయాలు ద్వారా రిజిస్ట్రేషన్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి అమలు చేస్తున్నదన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఉండి మండలం పేదపుల్లేరు గ్రామ సచివాలయంలో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రెండో విడతలో జిల్లాలోని 17 గ్రామ సచివాలయాలను
ఎంపిక చేసి రిజిస్ట్రేషన్లు ప్రక్రియను ప్రారంభించడం జరిగిందన్నారు. తదుపరి మూడో దశలో 51 గ్రామాల సచివాలయలను ఎంపిక చేయడం జరిగిందని ఆయా సచివాలయాలు ద్వారా రిజిస్ట్రేషన్లు చేయుటకు చర్యలు తీసుకోవటం జరుగుచున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు త్వరలో రిజిస్ట్రేషన్లు ప్రక్రియను ప్రారంభిస్తామని జిల్లా జాయింట్ కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రిజిస్ట్రారు ఆర్.సత్యనారాయణ, సబ్ రిజిస్ట్రార్లు జి శివయ్య, పి వెంకటేశ్వర రావు, వెంకటేశ్వర రావు, యం భూషణం, పి.రుక్మిణీ, తదితరులు పాల్గొన్నారు.