Headlines

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొడుకు వివాదం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొడుకు వివాదంలో చిక్కుకున్నాడు. మహేంద్ర యూనివర్సిటీలో చదువుతోన్న బండి భగరీథ… తోటి విద్యార్థిని కొడుతున్నట్లుగా ఉన్న ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. పచ్చి బూతులు తిడుతూ విద్యార్థిని చితకబాదిన దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. భగరీథ మిత్రుడైన మరో స్టూడెంట్ ఆ విద్యార్థిపై చేయి చేసుకున్నాడు. కలకలం సృష్టించిన ఈ వీడియోను… తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ వై సతీశ్ రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. “బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కొడుకు కళాశాలలో తోటి విద్యార్థులపై ర్యాగింగ్, వేధింపులకు పాల్పడ్డాడు. యూనివర్సీటీలో తోటి విద్యార్థిని దారుణంగా తిడుతూ కొట్టాడు. కాలితో తన్నాడు. బాధిత విద్యార్థి ఆసుపత్రి పాలయ్యాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఘటనపై సమాధానం చెబుతారా ?” అని ప్రశ్నించారు సతీశ్ రెడ్డి. వీడియో వైరల్ కావడంతో…. బాధితుడిగా పేర్కొంటున్న విద్యార్థి ఘటనపై స్పందించాడు.

తాను ఓ అమ్మాయితో తప్పుగా ప్రవర్తించినందు వల్లే భగరీథ్ తనని కొట్టాడని.. ఇప్పుడు తాము కలిసే ఉంటున్నామని చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. “నా పేరు శ్రీరామ్. నేను భగరీథ్ వాళ్ల ఫ్రెండ్ చెల్లికి రాత్రి 4 గంటలకి ఫోన్ చేసి ప్రేమించమని, మిస్ బిహేవ్ చేసిన. మెసేజ్ కూడా చేసిన. ఈ విషయం తెలిసి భగరీథ్ వచ్చి నాతో మాట్లాడాడు. అప్పుడు నేను ఎక్కువ తక్కువ మాట్లాడిన. అందుకే భగరీథ్ నన్ను కొట్టిండు. ఆ తర్వాత జరిగిందేదో జరిగిపోయింది.. జరిగిందాని గురించి పట్టించుకుంటే మనకేం వస్తదని, అప్పటినుంచి కలిసే ఉంటున్నం. మా మధ్యల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. అయిపోయిందేదో అయిపోయింది. వాళ్లు కొట్టిర్రు. అదంతా అయిపోయింది. ఇప్పుడు కలిసే ఉంటున్నాం. మేము ఫ్రెండ్సే. మేం బ్యాచ్ మెట్స్ యే. సో.. దీన్నంతా మేము మర్చిపోయాం. ఆ వీడియో దేనికి పనికిరానిది. అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు అంతా మంచిగనే ఉంటున్నాం. మంచిగున్నంక ఇంకేం ప్రాబ్లముంది. ఆ వీడియో ఎందుకు అసలు. మా మధ్యలో విభేదాలు పెంచడానికి తప్పితే దేనికి పనికిరాదు. విభేదాలు పెంచడానికే ఆ వీడియో పట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నరు.