Headlines

మిషన్ వాత్సల్య పథకం అంటే ఏమిటో తెలుసా..? పూర్తి వివరాలు ఇవే..!

మిషన్ వాత్సల్య పథకం అంటే ఏమిటో తెలుసా..? పూర్తి వివరాలు ఇవే..!

ఇప్పుడు ఈ పథకం గురించి చాలా విషయాలు వివరంగా చెప్పుకుందాం.అందులో
1) పథకం యొక్క ఉద్దేశ్యం : దేశంలోని అనాధాలు, అభాగ్యులు,నిరుపేదల పిల్లల యొక్క విద్య,వైద్యం పై దృష్టి పెట్టి అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పేదరికం కారణంగా ఈ రెండింటికి దూరం కాకూడదు అనే భావం తో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్పాన్సర్షిప్ ఇచ్చి ఈ మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆర్ధిక సాయం చేస్తున్నారు.

ఆర్ధిక సాయం: నెలకు రూ.4,000
నిర్ణీత వయస్సు: 18 సంవత్సరాలు లోపల బాల,బాలికలు ఇద్దరికి
చివరి తేదీ: ఏప్రిల్ 15

ఇందులో కేంద్ర ప్రభుత్వం 60% అంటే రూ 2,400 ఆర్ధిక సాయం అందచేస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం 40% అంటే రూ.1600 ఆర్ధిక సాయం అందచేస్తుంది.
2) కావాల్సిన అర్హతలు
1) తల్లి తండ్రులను కోల్పోయిన పిల్లలు
2) పాక్షిక అనాధలు (తల్లి లేక తండ్రి ని కోల్పోయిన వారు అయినా)
3)విడాకులు పొందిన తల్లిదండ్రుల పిల్లలు అయినా
4) కుటుంభం వదిలిపెట్టిన పిల్లలు అయినా
5) తల్లిదండ్రులు కి ప్రాణాంతక వ్యాధిన పడివున్నా
6) తల్లిదండ్రులు శారీరకంగా అసమర్థులు అయినా (ఏదైనా వికలాంగతత్వం)
7) ఇంటి నుండి పారిపోయి వచ్చిన బాల యాచకులు
8) HIV బారిన పడిన బాలలు
9) కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ను కోల్పోయిన వారి పిల్లలు
10) బాల కార్మికులు
11) PM Care For Children Scheme లో లబ్ది పొందుతున్న పిల్లలు అయినా
3) కావాల్సిన డాకుమెంట్స్
1) జనన ధ్రువీకరణ పత్రం
2) పిల్లల ఆధార్ కార్డ్
3) తల్లిదండ్రులు ఆధార్ కార్డ్ లేదా గార్డియన్ ఆధార్ కార్డ్
4) తల్లి/తండ్రి మరణ దృవీకరణ పత్రం
5) రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డ్
6) కుల ధ్రువీకరణ పత్రం
7) ఆదాయ ధ్రువీకరణ పత్రం
8) పాస్పోర్ట్ సైజ్ ఫోటో
9) స్టడీ సర్టిఫికెట్
10) పిల్లల యొక్క వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ వున్నా లేదా తల్లిదండ్రులు / సంరక్షకుని తో పాటు కలసి ఉన్న జాయింట్ అకౌంట్
4) వార్షిక ఆదాయం
ఈ పథకం క్రింద లబ్ది పొందుటకు గ్రామాల్లో నివసించేవారి యొక్క వార్షిక కుటుంబ ఆదాయం 72 వేలు కంటే మించరాదు.
పట్టణం లో నివసించే వారి యొక్క వార్షిక ఆదాయం 96 వేలు కంటే మించరాదు.

5) అప్లికేషన్ ఎవరి దగ్గర ఇవ్వాలి
ఈ పేజీ క్రింద ఇచ్చిన అప్లికేషన్ ని మరియు పైన తెలిపిన డాకుమెంట్స్ ని జతపరచి ఈ క్రింది వారికి సమర్పించాలి.
ఆంద్రప్రదేశ్: ఆంద్రప్రదేశ్ కి చెందిన వాళ్ళు సచివాలయంలో ని మహిళ సంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీస్) లేదా అంగన్వాడీ టీచర్ కి అందచేయాలి.
తెలంగాణ: పై అప్లికేషన్ ని మరియు సరైన డాకుమెంట్స్ ని జతపరచి మీ దగ్గర్లోని అంగన్వాడీ టీచర్ దగ్గర సమర్పించాలి.
6) వెరిఫికేషన్ ప్రాసెస్
అప్లికేషన్ ని అంగన్వాడీ సిబ్బంది ద్వారా ICDS డిపార్ట్మెంట్ అయిన CDPO Office చేరుతాయి.అక్కడ మండల స్థాయి కమిటీ (MRO, MPDO,MEO,CDPO,ISDS సూపరవైజర్) మీటింగ్ లో దరఖాస్తులు ని నిశితంగా పరిశీలించి అర్హత కలిగిన వారికి కమిటీ సభ్యలు సంతకాలు చేసి జిల్లా మహిళ శిశు సంక్షేమ సాధికారత అధికారి యొక్క కార్యాలయానికి సమర్పిస్తారు.