Headlines

కొండపాక మండలం మర్పడగ శ్రీ విజయ దుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శ్రీ విజయ దుర్గా అమ్మవారి 14వ వార్షికోత్సవం..

కొండపాక మండలం మర్పడగ శ్రీ విజయ దుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో

శ్రీ విజయ దుర్గా అమ్మవారి 14వ వార్షికోత్సవం సందర్భంగా దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ చెప్పెల హరినాధశర్మ గారి ఆధ్వర్యంలో ఉదయము గణపతి పూజ, స్వస్తివాచనం, అష్టోత్తర శత కలశాభిషేకం పూజలు ఘనంగా నిర్వహించారు

ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులచే అమ్మవారికి అభిషేక కార్యక్రమము, పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు

అనంతరము అన్న ప్రసాద వితరణ జరిగినది

ఈ కార్యక్రమంలో క్షేత్ర నిర్వహణ కమిటీ సభ్యులు గట్టు విట్టల్, మర్యాల వీరేశం, జిల్లా సతీష్, చిలువేరి శ్రీనివాస్, చీకోటి మల్లికార్జున్, మర్యాల రవీందర్, చీకోటి రాజేంద్రప్రసాద్, రాజు, మల్లేశం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు