Headlines

రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి.జిల్లా జాయింట్ కలెక్టర్ టి .యస్. చేతన్.

 

పుట్టపర్తి, న్యూస్ 9. సెప్టెంబర్ 1:

పుట్టపర్తి రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ.ఎస్. చేతన్ ఆదేశించారు.
శుక్ర వారం ఉదయం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం, రీసర్వే ప్రక్రియ, ఇతర అంశాలపై పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్, పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ, కదిరి ఆర్డిఓ రాఘవేంద్ర, ఎ.డి. సర్వే అండ్ ల్యాండ్ రామకృష్ణన్, తాసిల్దార్లు, రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్లు , ఉప సర్వే పరిశీలకులు, తదితరులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు.
అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం కింద రీసర్వే ప్రక్రియను వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లాలో మొదటి దశలో 26 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తి కాగా, ఆయా గ్రామాల్లో భూపత్రాల కూడా పంపిణీ చేయడం జరిగిందని, స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియ పూర్తి కావడం జరిగిందన్నారు. అలాగే రెండవ దశలో 59 గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియను చేపట్టడం జరిగిందని, ఆయా గ్రామాల్లో రీసర్వే పనులు వేగంగా చేపట్టాలన్నారు. దీనికై 13 నోటిఫికేషన్ మరియు డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ జారీ చేయబడినదని తెలిపారు. ఇందులో మిగిలిన గ్రామాల్లో కూడా స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. మూడవ విడుదల సర్వే మొత్తం 209 గ్రామాల్లో గ్రౌండ్ టూతింగ్ ,వెటరజేషన్, గ్రామ సర్వే లాగిన్ మరియు విఆర్ఓ, ఆర్డీవోలు, తాసిల్దార్ తదితర అంశాలకు సంబంధించి ముఖ్యంగా డిసెంబర్ 31 నిర్దేశిత సమయంలో రీసర్వే కింద అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేయాలని, ఈ విషయమై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.