Headlines

వినూత్న పరిశోధనలతో నవశకానికి నాంది పలకాలి: ఏపీ నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి

 

పశ్చిమగోదావరి జిల్లా,
తాడేపల్లిగూడెం, నవంబర్ 3:

వినూత్న పరిశోధనలతో నవశకానికి నాంది పలకాలని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న టెక్రియా 2023 ఆరంబ్ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ జీబి వీరేష్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధి దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ
పరిశోధనలు దేశానికి దిక్సూచి వంటివని, విద్యార్థులు తమ ఆలోచనలకు పదునుపెడితే అద్భుత ఆవిష్కరణలకు రూపకల్పన చేయవచ్చన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి కప్పుడు సాంకేతిక రంగంలో అత్యాధునిక పరిణామాలు చోటుచేసుకుంటుంన్నాయని, వాటికనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని తెలిపారు. సృజనాత్మక ప్రతిభ కలిగిన విద్యార్థులకు డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.
విద్యార్థుల్లో వైజ్ఞానిక స్పృహను పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు కొత్త కొత్త ప్రాజెక్టులు, ఆవిష్కరణలు చేపట్టి సంస్థ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని వివరించారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన ప్రాజెక్టులను రిజిస్ట్రార్ పరిశీలించి, వాటి వివరాలు, ప్రాధాన్యతను అడిగి తెలుసుకున్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీన్ లు డాక్టర్ ఎన్.జయరామ్, డాక్టర్ టి.కురుమయ్య, ఆచార్యులు డాక్టర్ వి.సందీప్, డాక్టర్ టి.రమేష్, డాక్టర్ కిరణ్ తీపర్తి, డాక్టర్ తపస్, డాక్టర్ రెస్మా, డాక్టర్ హిమబిందు, డాక్టర్ సుదర్శన్ దీప, ప్రోగ్రామ్ సెక్రటరీ జకీర్ ప్రణవ్ తదితరులు