Headlines

‘మళ్ళీ’ అదే మాట.! విశాఖలో వైఎస్ జగన్ కొత్త కాపురం.!

: ‘విశాఖపట్నం వచ్చేస్తున్నా..’ అని చెప్పడం వేరు.! విశాఖపట్నంలో కాపురం పెడతా.. అనడం వేరు.! కొత్తగా పెళ్ళయ్యేవాళ్ళు పెట్టేది కాపురం.!

ఆ తర్వాత అది సంసారంగా మారుతుంది.!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్క్రిప్టు ఎవరు రాస్తున్నారోగానీ, ఈ ‘కాపురం’ అన్నమాట చాలామందికి యెలపరం పుట్టేస్తోంది (మహేష్‌బాబు ఓ తెలుగు సినిమాలో ఈ మాట ఉపయోగిస్తాడు..).

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు ఉత్తరాంధ్రలో పర్యటించారు. విశాఖపట్నం సమీపంలో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి శంకుస్థాపన చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

అదేంటీ, గతంలో ‘ఎయిర్ పోర్టు కోసం రైతుల నుంచి తీసుకున్న భూముల్ని తిరిగిచ్చేస్తాం.. విశాఖలో విమానాశ్రయం వుండగా.. పక్కనే ఇంకో విమానాశ్రయమెందుకు.?’ అని నినదించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అప్పట్లో ప్రతిపక్ష నేత.. ఇప్పుడు ముఖ్యమంత్రి.. అందుకే, ఇప్పుడు మాట మారింది.

రెండేళ్ళలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయిపోయి, తొలి విమానం దిగేస్తుందట.! సరిపోయింది సంబరం.! వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళయ్యింది.. నిజానికి అంతకు ముందే.. అంటే, 2019 ఫిబ్రవరిలోనే భోగాపురం విమానాశ్రయానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసేశారు.

ఆ లెక్కన, వైఎస్ జగన్ అధికారంలోకి వస్తూనే, అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు చేపట్టి వుంటే, ఈపాటికి ఆ నిర్మాణం పూర్తయిపోయి.. విమానాల రాకపోకలూ జరిగి వుండేవి.!

శంకుస్థాపన.. మళ్ళీ మళ్ళీ.! అది కడప ఉక్కు పరిశ్రమ విషయంలో అయినా, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో అయినా.. జరుగుతున్నది అదే.! సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురమట.! ఈ విషయాన్ని జగన్ ఇంకోసారి చేశారు. అది కూడా శంకుస్థాపన లాంటిదే అవుతుందా.?