Headlines

రెజ్లర్స్ నిరసనలతో బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు

రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Wrestling Federation of India WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Singh) పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు.

Wrestlers’ protest: సుప్రీంకోర్టులో విచారణ

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Wrestling Federation of India WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Singh) మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ.. ప్రముఖ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర మంతర్ వద్ద నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Singh) పై వారి ఆరోపణలకు సంబంధించిన పటిషిన్ ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ప్రాథమిక దర్యాప్తు చేయకుండా, కేవలం ఆరోపణల ఆధారంగా నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేమని ఢిల్లీ పోలీసులు ఇదే సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఏప్రిల్ 26వ తేదీన తెలపడం గమనార్హం. దాంతో, బ్రిజ్ భూషణ్ (Brij Bhushan Singh) పై ఆరోపణలు చేసినవారి భద్రత, రక్షణ విషయం పరిగణనలోకి తీసుకోవాలని నాడు సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసు కమిషనర్ కు సూచించింది. నిందితుడు బ్రిజ్ భూషణ్ (Brij Bhushan Singh) పై 40 కేసులు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా రెజ్లర్ల తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

Wrestlers’ protest: ఇది రెండో సారి..

బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Singh) పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం ఇది రెండో సారి. గతంలో ఈ జనవరి నెలలో బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులపై ఇలాగే బహిరంగంగా నిరసన తెలిపారు. అయితే, అప్పుడు వారి ఆరోపణలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వారు నిరసన ను విరమించారు. కానీ ప్రభుత్వ హామీలేవీ నెరవేరకపోవడంతో పాటు, బ్రిజ్ భూషణ్ (Brij Bhushan Singh) వేధింపులు కొనసాగుతుండడంతో మళ్లీ నిరసన బాట పట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వీరి నిరసనను స్వయంగా మహిళ అయిన, ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష (PT Usha) విమర్శించడం విశేషం. రెజ్లర్లు ఇలా వీధుల్లోకి ఎక్కి నిరసన తెలపడం సరికాదని, కొంత క్రమశిక్షణ పాటించి ఉంటే, బావుండేదని ఆమె వ్యాఖ్యానించారు.