Headlines

టిడిపి వీడి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరిక

యాడికి : మండల పరిధిలోని కోన ఉప్పలపాడు గ్రామంలో టిడిపిని వీడి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి సమక్షంలో, మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఒంటెద్దు కేశవరెడ్డి, కులశేఖర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి,కిరణ్ కుమార్ రెడ్డి, మరికొన్ని కుటుంబాలు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి చేతుల మీదుగా కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. జెసి కుటుంబానికి ముఖ్య అను చరుడైన చవ్వా గోపాల్ రెడ్డి తమ్ముళ్లు టిడిపి పార్టీని వీడి వైసీపీలో చేరడం టిడిపికి గట్టి షాక్ అనే చెప్పవచ్చు…. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వెంకట్రామిరెడ్డి నగరూరు బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు