Headlines

బీభత్సం సృష్టించిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు..

కొత్తపేట : వేగంగా దూసుకు వచ్చిన కారు బీభత్సం సృష్టించడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కొత్తపేట మండలం ఏనుగు మహల్ వద్ద బుధవారం ఈ ప్రమాదం జరిగింది. రావులపాలెం నుంచి అమలాపురం వెళుతున్న మారుతి రిడ్జ్ కారు వేగంగా వచ్చి ఒక ఆటోను రెండు బైకులను ఢీ కొట్టి చికెన్ షాపులోకి దూసుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అవ్వడంతో పాటు ఆటో, రెండు బైకులు దెబ్బతిన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన వారిని…

Read More

జౌళి పరిశ్రమలోని కార్మికుల సామర్థ్యాన్ని మెరుగుపరచేందుకు కేంద్రం ప్రారంభించిన సమర్థ్ పథకం గురించి పార్లమెంటులో ప్రశ్నించిన అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ గారు..

ఈరోజు గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు పార్లమెంటులో మాట్లాడుతూ, జౌళి పరిశ్రమలోని కార్మికుల సామర్థ్యాన్ని మెరుగుపరచేందుకు కేంద్రం చేపట్టిన సమర్థ్ (Scheme for Capacity Building in Textile Sector (SCBTS)) పథకం ద్వారా జరిగిన పురోగతి మరియు ప్రస్తుత ప్రరిస్థితిని గురించి ప్రశ్నించారు   ఇందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి వర్యులు శ్రీ పీయూష్ గోయల్ గారు సమాధానమిస్తూ, సమర్థ్ పథకాన్ని జౌళి పరిశ్రమలో కార్మికుల సామర్థ్యాన్ని పెంచేందుకు…

Read More

పీపుల్స్ మార్ట్ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు..

మన్యం న్యూస్, పినపాక, మార్చి 15 పినపాక నియోజకవర్గం నుంచి గురువారం రోజున అదిలాబాద్ జిల్లాలో జరగనున్న పీపుల్స్ మార్ట్ పాదయాత్రకు సంఘీభావంగా బుధవారం నియోజకవర్గ  సుమారు 100 మంది కార్యకర్తలతో వెళ్తున్నామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం తెలియజేశారు. ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో పిసిసి సభ్యులు చక్రవర్తి, చందా సంతోష్ పినపాక మండల అధ్యక్షులు రామనాథం లు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక…

Read More

హెచ్చుమీరుతున్న వైసిపి ఆగడాలు.అధికారం మాటున రెచ్చిపోతున్న మట్టి మాఫియా..ప్రశ్నించిన వారి ఇళ్లపై దాడులు

రావులపాలెం, కొమరాజులంక // అధికారం అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకీ పెరిగి పోతున్నాయని ఇళ్లపై దాడులకు దిగుతున్నారని కొత్తపేట నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు.   అధికారం అడ్డుపెట్టుకుని మట్టి మాఫియా చెలరేగిపోతోంది. ధన దాహంతో కొట్టుమిట్టాలాడుతున్నారు. వారిని ప్రశ్నించినా, లేదా అడ్డు తగిలినా ఇంటి మీదకు వచ్చి దాడులకు దిగుతున్నారని దళిత సోదరులను పావులుగా చేసి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా గ్రామాలలో ప్రశాంతతను భంగం కలిగిస్తున్నారని…

Read More

ఈరోజు గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్ లో ఇచ్చిన అల్పాహార విందు కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్‌కర్ గారు, స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారు, కేంద్ర మంత్రులు మరియు ఎంపీలతో కలిసి పాల్గొన్న గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు..

ఈరోజు గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్ లో ఇచ్చిన అల్పాహార విందు కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్‌కర్ గారు, స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారు, కేంద్ర మంత్రులు మరియు ఎంపీలతో కలిసి పాల్గొన్న గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు

Read More

కొత్తపేట నియోజక వర్గం రావులపాలెం వైపు గౌతమి బ్రిడ్జిపై నుండి గోదావరి నదిలోకి దూకిన వ్యక్తి…

— కొత్తపేట నియోజక వర్గం రావులపాలెం వైపు గౌతమి బ్రిడ్జిపై నుండి గోదావరి నదిలోకి దూకిన వ్యక్తి. — నామపై వెళ్లి సుమారు అరగంట పాటు శ్రమించి ఒడ్డుకు చేర్చిన రావులపాలెం ఎస్సైలు రమణ, సురేంద్ర, హైవే పెట్రోలింగ్ పోలీసులు విఏబి స్వామి, సిహెచ్ రామ్మోహనరావు, హైవే సిబ్బంది. — క్షతగాత్రునికి ప్రధమ చికిత్స అందిస్తున్న హైవే అంబులెన్స్ సిబ్బంది. — అనంతరం హైవే అంబులెన్స్ పై కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. — క్షతగాత్రుని పరిస్థితి…

Read More

ధన దాహంతో వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు….

కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా మట్టి, ఇసుక, మద్యం అక్రమ తవ్వకాలు, అమ్మకాలతో కోట్ల రూపాయలు దోచుకున్న కొందరు వైసిపి నాయకులు తమ ధన దాహం తీరక తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు… కొత్తపేట నియోజక వర్గం రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలో పార్టీ సీనియర్ నేత గుర్రాల నాగభూషణం ఇంటిపై వైసీపీ సర్పంచ్ అనుచరులు దాడికి పాల్పడటం హేయమైన చర్య… ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం… దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం… కొమ్మరాజులంక సర్పంచ్…

Read More

పరీక్ష కేంద్రాలు పరిశీలించిన సీఐ రజిని కుమార్*

కొత్తపేట మండల కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను రావులపాలెం సిఐ రజిని కుమార్ పరిశీలించారు. విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారనేది అబ్జర్వ్ చేశారు. పరీక్ష రాసే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానిక పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై మణికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

ప్రభుత్వ పాఠశాల కు 11 వేలు విలువచేసే వంట సామాగ్రి బహుకరణ..

వక్కలంక… అంబాజీపేట మండల పరిధిలోని వక్కలంక గ్రామంలో పంచాయతీ వద్ద ఉన్న మండల ప్రజా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్దులకు భోజన పదార్ధాలు వడ్డించుటకు మరియు వంట చేయుటకు ఇబ్బంది లేకుండా ఉండటానికి వక్కలంక గ్రామానికి చెందిన వాసంశెట్టి విజయ భాస్కరరావు 11 వేల రూపాయల విలువ గల వంట సామాగ్రి మరియు మిక్సీ ని సమకూర్చి స్థానిక సర్పంచ్ వాసంశెట్టి రేవతి పెదబాబు గారి చేతుల మీదుగా పాఠశాల సిబ్బందికి అందించారు.ఈ సందర్భంగా…

Read More

డాక్టర్ గారు డ్యూటీకి వస్తారా..?..కొన్ని రోజులుగా డ్యూటీకి రాని గైనకాలజిస్ట్..

డాక్టర్ గారు డ్యూటీకి వస్తారా..? కొన్ని రోజులుగా డ్యూటీకి రాని గైనకాలజిస్ట్ సెలవులు తీసుకున్నారన్న సూపరింటెండెంట్ లీవ్ పూర్తయినా రాకపోవడంతో తలెత్తుతున్న పలు ప్రశ్నలు కొత్తపేట.. అది ఒక ప్రభుత్వ ఆసుపత్రి.. అక్కడ వైద్యం చేయించుకోవడానికి చాలామంది వెనుకాడుతుంటారు.. వేలకు వేలు పోసి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటారు.. ప్రసవాలైతే చెప్పనక్కర్లేదు.. పుట్టే బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉండాలని ఎంత ఖర్చైనా ప్రైవేట్ ఆసుపత్రులనే ఆశ్రయిస్తారు చాలామంది.. అలాంటిది ఆ వైద్యుడు వచ్చిన తర్వాత పరిస్థితి మారింది…..

Read More