Headlines

దుద్దెడ గ్రామానికి చెందిన జక్కుల రాకేష్ కు 60000 సిఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణి….

దుద్దెడ గ్రామానికి చెందిన జక్కుల రాకేష్ కు 60000 సిఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణి….

కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన జక్కుల రాకేష్ గారికి ఈరోజు దుద్దెడ గ్రామ సర్పంచ్ ఆరెపల్లి మహాదేవ్ గారితో కలిసి బిఆర్ఎస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ 60000 రూపాయల చెక్కును జక్కుల రాకేష్ కు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు నెలల క్రితం జక్కుల రాకేష్ దుద్దెడ టోల్గేట్ దగ్గర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాదు లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోగా ఈ విషయాన్ని జక్కుల రాకేష్ కుటుంబ సభ్యులు బారాస మండల అధ్యక్షుడు నూనె కుమార్ కు తెలియజేయగా వెంటనే నూనె కుమార్ గారు గౌరవ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్లి మంత్రిగారి సహకారంతో 60000 రూపాయలను మంజూరు చేయించి ఈ రోజు చెక్కు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జక్కుల రాకేష్ కుటుంబ సభ్యులు మంత్రి హరీష్ రావు గారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలిపారు….

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆంజనేయులు, సీనియర్ నాయకులు దోమల ఎల్లం, పిళ్లి నాగరాజు, పల్లె బాబు, మిద్దె భాను గౌడ్, కెమ్మసారం శ్యామ్, వార్డు సభ్యులు గున్నాల చంద్రకళ, జయరాములు పంతులు తదితరులు పాల్గొన్నారు.. .