Headlines

రైతు రుణమాఫీతో కొండపాక మండలంలో అంబరాన్ని అంటిన సంబరాలు

నూనె కుమార్, పిసక అమరెందర్

తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ లక్ష లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం తో ఈరోజు కొండపాక మండలంలోని కోపరేటివ్ బ్యాంకు ఆవరణలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ పిసుక అమరేందర్, బారాస మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు జిల్లా మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, స్వీట్లు పంచుకొని అంబరాన్ని అంటేలా సంబరాలు చేసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిద్దిపేట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ,
ఎంపీపీ రేగళ్ల సుగుణ దుర్గయ్య గార్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంతోషమే ధ్యేయంగా రైతు బాంధవుడుగా పలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి 24 గంటల ఉచిత కరెంటు తీసుకొచ్చి దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా నిలిచారని అన్నారు.
ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల పట్ల ఒక సంచలన నిర్ణయం తీసుకొని రైతులకు లక్షలోపు బకాయి ఉన్న రైతులందరికీ రుణమాఫీ ప్రకటన చేస్తూ 19000 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.
నిరంతరం రైతుల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెంట తెలంగాణ ప్రజానీకమంతా రైతులు, కార్మికులు, కర్షకులు ముక్తకంఠంతో కేసీఆర్ గారికి మద్దతుగా నిలుస్తారని తెలిపారు.
24 గంటలు ఉచిత కరెంటుతో తెలంగాణ రైతాంగమంతా సంతోషకరంగా ఉంటే ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు చాలు అని రైతుల పాలిట శాపంగా మాట్లాడుతున్నారని తెలిపారు.
రాబోవు రోజుల్లో రైతు వ్యతిరేక నిర్ణయాలకు ఆజ్యం పోస్తున్న కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకులను గ్రామాల్లోకి వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు.

సబ్బండ వర్ణాల సంక్షేమ ద్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు గారికి వెన్నంటి నిలుస్తామని తెలిపారు.
రాబోవు ఎన్నికల్లో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రికార్డు సృష్టించబోతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు చింతల సాయిబాబా, మాజీ ఎంపీపీ బొద్దుల కనకయ్య, సర్పంచులు నీల మల్లేశం, ముత్యాల కనకయ్య, మల్లయ్య, సంజీవరెడ్డి, రాజిరెడ్డి, మల్లమారి రవీందర్, అమ్ముల రమేష్, పిడిశెట్టి శ్రీనివాస్, కర్ణాకర్ రెడ్డి, బడే కోల్ నర్సింలు, సురేందర్ రెడ్డి, ఎంపిటిసిలు బాలాజీ , ఆరుట్ల కనకయ్య, పిల్లి నాగరాజు, ఆంజనేయులు,
నాయకులు బైరి రామకృష్ణారెడ్డి, బూర్గుల సురేందర్ ,ఆరె భాస్కర్, కృష్ణమూర్తి, మల్లేశం ,సింగాటం రాములు, అంబటి భానుచందర్, రాములు, పెద్దనుకుల శ్రీనివాస్ గౌడ్, బురుగోజు బాల బ్రహ్మం, దొమ్మాట మహిపాల్ రెడ్డి, దోమల ఎల్లం, సున్నం భాస్కర్, చెప్యాల చిరంజీవి, మైలారం శ్రీనివాస్, సాదు పల్లి కనకసేన, బాలకృష్ణ చారి, రాసుల నరేందర్, గంగాధర్, మహిపాల్ రెడ్డి, రేపాక స్వామి, తప్పుడు సురేష్, మూగ నర్సింలు, బాలరాజు, చిక్కుడుబాను , పల్లె బాబు తదితరులు పాల్గొన్నారు…….