Headlines

గ్రామ పంచాయితీ కార్మికుల రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి–;ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి…

 

జనవరి 28న వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగే తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభలు,ఈ సందర్భంగా జరిగే కార్మిక ప్రదర్శన, బహిరంగ సభలను విజయవంతం చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఆర్.మధుసూదన్ రెడ్డి. కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం పినపాక లో రాష్ట్ర మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది మొత్తాన్ని వెంటనే పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 50 ను రద్దు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ ,గ్రాటియిటి చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్ రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గానికి భీమా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రమాదం, అనారోగ్యం వల్ల వందల మంది చనిపోయిన గ్రామపంచాయతీ వర్కర్లకు నేటికీ బీమా అమలు చేయకపోవడం శోచనీయం అన్నారు. వెంటనే సహజ మరణానికి ఐదు లక్షలు, ప్రమాద మరణానికి 10 లక్షల బీమా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామపంచాయతీ వర్కర్స్ గత పది సంవత్సరాలుగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతు సతమతమవుతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.గత సంవత్సరం 34 రోజులు కార్మికులు సమ్మె చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదు. సమ్మె విచ్చిన్నానికి కుట్రలు చేసిన ఎంతో నిబ్బరంగా ఓర్పుతో కార్మిక వర్గం పోరాడిందన్నారు. అదే స్పూర్తితో భవిష్యత్ పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలన్నారు. 34 రోజులు సమ్మె చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేస్తాం కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు.

గ్రామపంచాయతీ కార్మికులను అక్రమ తొలగింపులు ఆపాలన్నారు, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని కోరారు.

*ఈ కార్యక్రమంలో నాయకులు జి. ముత్తయ్య, లక్ష్మయ్య, వెంకటనారాయణ, హనుమంతరావు, రాజు, బాలరాజు, సతీష్, భాను తదితరులు పాల్గొన్నారు.