Headlines

సాకేతపురి ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం , సారపాక లోని సాకేతపురి ఆంజనేయస్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ఉదయం నుండి ఆంజనేయస్వామికి అభిషేకము ,వస్త్రాలంకరణ, అష్టోత్రము, ఆకు పూజ, హనుమాన్ చాలీసా , వంటి ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ సాకేతపురి ఆంజనేయ స్వామి ఆలయం చిన్నదైనా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా విలసిల్లుతుందని ఈ ఆలయ కేంద్రముగా ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా, ప్రతినెల అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం, ప్రతి పండగ పర్వదినాల్లో ఆ పండగకు సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ కార్యక్రమాలన్నీ దాతల సహాయ సహకారయాలతో నిర్వహించడం జరుగుతుందని వారందరికీ ఆ ఆంజనేయస్వామి కరుణాకటాక్షాల లో ఉండాలని కోరుకుంటున్నామన్నారు ,ఈ కార్యక్రమంలో సాకేతపురి హనుమాన్ చాలీసా భక్త బృందం, సాకేతపురి ఆంజనేయ స్వామి సేవా సమితి సభ్యులు ,భక్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు