Headlines

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఛైర్మన్‌గా జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి మూడో ఛైర్మన్‌గా ముత్తిరెడ్డి నిలిచారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో, ముత్తిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఆర్టీసీ మరింత చేరువకావాలని, ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, తదితరులు పాల్గొన్నారు. కాగా, ముత్తిరెడ్డి టీఎస్ఆర్టీసీ ఛైర్మన్‌గా రెండు సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ కొనసాగిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో తాజాగా, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు, జనగామ నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టికెట్ దక్కుతుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. జనగామ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అసంతృప్తితో ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టినట్లు తెలుస్తోంది. మరికొందరు అసంతృప్తులకు కూడా ఇలాంటి పదవులు ఇచ్చి బుజ్జగించే పనిలో పడింది బీఆర్ఎస్. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కూడా బీఆర్ఎస్ టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కడియం శ్రీహరి పోటీలో ఉంటారని ఇప్పటికే సీఎం కేసీఆర్ విడుదల చేసిన జాబితా ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైతుబంధు ఛైర్మన్‌గా తాటికొండ రాజయ్యను నియమించింది ప్రభుత్వం. మరోవైపు, రాష్ట్ర ఎంబీసీ ఛైర్మన్‌గా నందికంటి శ్రీధర్, మిషన్ భగీరథ వైఎస్ ఛైర్మన్‌గా ఉప్పుల వెంకటేష్ గుప్తా నియమితులయ్యారు. వీరి నియామకాలపై తెలంగాణ సర్కారు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఛైర్మన్‌గా జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి మూడో ఛైర్మన్‌గా ముత్తిరెడ్డి నిలిచారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో, ముత్తిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఆర్టీసీ మరింత చేరువకావాలని, ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు….

Read More

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: 20 మందితో బీఎస్పీ తొలి జాబితా, ప్రవీణ్ కుమార్ పోటీ ఎక్కడ అంటే?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(BSP) సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోపాటు మొత్తం 20 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. కాగా, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ అభ్యర్థుల తొలి…

Read More

2023 సంవత్సరం అక్టోబర్ మాసానికి చాలా ప్రాధాన్యత

2023 సంవత్సరం అక్టోబర్ మాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో మన అనేక ముఖ్యమైన పండుగలు జరుగుతాయి. అంతేకాదు ఈ మాసంలో అనేక కీలక గ్రహాల సంచారం ప్రాధాన్యతను సంతరించుకుంది. మనిషి జీవితం పైన ప్రభావం చూపించే గ్రహాల సంచారం అక్టోబర్ నెలలో కీలకం కానుంది. అన్ని రాశులపైన ప్రధాన గ్రహాల సంచార ప్రభావం పడనుంది. ఇక అక్టోబర్ నెలలో గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుంది?ఏ గ్రహం ఏ రాశిలో కి ఎప్పుడు ప్రవేశిస్తుంది?…

Read More

ఎమ్ ఎస్ స్వామినాథన్‌ను దేశ అత్యున్నత పౌరపురస్కారంతో గౌరవించాలి..

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు మరణానంతర భారతరత్న అవార్డుతో ఆయనను గౌరవించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇప్పటికే ఆయనకు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న అవార్డు ఇవ్వడంలో ఆలస్యం చేశారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఆయనకు భారతరత్న ఇవ్వడం ద్వారా శాస్త్రవేత్తలను, ఈ దేశ రైతాంగాన్ని, వ్యవసాయరంగాన్ని గౌరవించినట్లు అవుతుందని తెలిపారు. ఎంఎస్ స్వామినాథన్‌కు ఇప్పటికైనా భారతరత్న అవార్డును ఇవ్వాలని తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రభుత్వం…

Read More

యాడికి గ్రామంలో హిజ్రాలు కలకలం షాప్స్ వద్దకు వెళ్ళి డబ్బులు

ఈరోజు యాడికి గ్రామంలో హిజ్రాలు కలకలం షాప్స్ వద్దకు వెళ్ళి డబ్బులు అడుక్కుంటున్నారని సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్లి హిజ్రాలను స్టేషన్ కు తీసుకొచ్చి ఎవరైనా బలవంతపు వసూళ్లకు పాల్పడిన యెడల చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించడం జరిగింది  ఎస్సై యాడికి

Read More

మూడనమ్మకాలకు సీఎం చాలెంజ్, రెండోసారి, ఏం జరుగుతుందో అని టెన్షన్ !

బెంగళూరు/మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (siddaramaiah) రెండోసారి సీఎం అయిన తర్వాత తొలిసారిగా చామరాజనగర్‌లో పర్యటించి దృష్టిని ఆకర్షించనున్నారు. చామరాజనగర్‌లో పదుల సంఖ్యలో పర్యటించి, సిఎం వస్తేనే చామరాజనగర్‌కు (chamarajanagara) కరెంటు వస్తుందన్న మూర్ఖత్వాన్ని కొట్టిపారేసి గ్రాంట్లు కురిపించారు. చామరాజనగర్ జిల్లా కేంద్రంలో మనస్వాణి అనే ప్రాజెక్టును ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు మళ్లీ సిద్ధరామయ్య (siddaramaiah) బుధవారం చామరాజనగర్‌లో (chamarajanagara) పర్యటించి ప్రగతి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. చామరాజనగర్ జిల్లా కేడీపీ సమావేశం ముఖ్యమంత్రి…

Read More

వేములపాడు వద్ద యాడికి పట్టణంలోని వినాయక విగ్రహాలు. అలాగే రాయల చెరువు చందన ప్రాంతాల లో వినాయక మండపాలు ఏర్పాటు

వేములపాడు వద్ద యాడికి పట్టణంలోని వినాయక విగ్రహాలు. అలాగే రాయల చెరువు చందన ప్రాంతాల లో వినాయక మండపాలు ఏర్పాటు చేసుకున్న వారందరూ వినాయకుని నిమజ్జనం చేయడానికి వేములపాడు హైవేలో యాడికి ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిమజ్జన ఏర్పాట్లు పూర్తి చేశారు. వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలతో పోలీసు అధికారులు సిద్ధం చేశారు. నిమజ్జన కార్యక్రమం భాగంగా పట్టణంలో వినాయకుని…

Read More

పోలింగ్ స్టేషన్ల రేషనల్లైజేషన్ అత్యంత పగడ్బందీగా పూర్తి చెయ్యాలి: జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి

పోలింగ్ స్టేషన్ల రేషనల్లైజేషన్ అత్యంత పగడ్బందీగా పూర్తి చెయ్యాలి: జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం: సెప్టెంబరు 20: పోలింగ్ స్టేషన్ల రేషనల్లైజేషన్ అత్యంత పగడ్బందీగా పూర్తి చెయ్యాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు బుధవారం భీమవరం పురపాలక సంఘం పరిధి, రూరల్ గ్రామాలలో ప్రకాష్ నగర్, గునుపూడి, శ్రీరామపురం, రాయలం, వెంప, దురుసుమర్రు పోలింగు స్టేషన్లను జిల్లా కలెక్టరు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగు స్టేషన్లు గదులు, విద్యుత్తు, డోర్సు,…

Read More

హెచ్.పీ.గ్యాస్ వినియోగదారులకు దీపావళి బంపర్ బహుమతులు

హెచ్.పీ.గ్యాస్ వినియోగదారులకు దీపావళి బంపర్ బహుమతులు -డీజిఎం అన్నవరపు సుందర వదన్ బహుమతులతో ఖాతాదారులను ప్రోత్సహించడం అభినందనీయం కొట్టువిశాల్ పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 20: కొత్తగా హెచ్ పి గ్యాస్ కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు దీపావళి పండుగ సందర్భంగా కంపెనీ బంపర్ బహుమతులు ఇస్తున్నట్లు హెచ్ పి గ్యాస్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ అన్నవరపు సుందర వదన్ వెల్లడించారు. బహుమతులతో ఖాతాదారులను ప్రోత్సహించడం అభినందనీయమని వైకాపా యువజన నాయకులు కొట్టు విశాల్ అన్నారు. స్థానిక…

Read More

హిందూపూర్ పట్టణం లో గణపతి ఉత్సవలు ఎలా చేయాలి రూల్స్ ఎలా పాటిచాలి అని అనంతపూర్ Dsp మరియూ Sp పోలీస్ వాలు వివరాలు

హిందూపూర్ పట్టణం లో గణపతి ఉత్సవలు ఎలా చేయాలి రూల్స్ ఎలా పాటిచాలి అని అనంతపూర్ Dsp మరియూ Sp పోలీస్ వాలు వివరాలు తెలిపారు అలాగా మన హిందూ సంస్థ పెద్దలు పోలీస్ వాళ్లతో మాట్లాడుతూ ,నిమరజనమ్ లొ డీజే మరియూ ,డ్రమ్స్, ప్రోగారామ్స్ తో నిమర్జనం జరుగుతుది అని పోలీస్ వాళ్లతో మాట్లాడారు 18/9/2023 న గణపతి ఉత్సవలు ప్రారంభం అవుతాయి .గణపతి నిమర్జన౦ 24/9/2023 తెలిపారు . జై బోలో గణేష్ మహారాజ్  కి  జై

Read More