Headlines

దర్గా లో కంటి వెలుగు ప్రారంభం

 

*గ్రామానికి వచ్చి కంటి సమస్యలకు వైద్యం అందిస్తున్న వైద్యులను చూసి హర్షం వ్యక్తం చేస్తున్న దర్గా గ్రామ ప్రజలు

నూతన గ్రామపంచాయతీ దర్గాలో కంటి వెలుగు ఏర్పాటు చేయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలిపిన దర్గా గ్రామ సర్పంచ్ పిడిశెట్టి శ్రీనివాస్*

ఈరోజు కొండపాక మండలం దర్గ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పిడిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.

ఈ కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైతుబంధు కో ఆర్డినేటర్ రాగల దుర్గయ్య గారు, బారాస మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ గారు, ఎంపీడీవో రామిరెడ్డి గారు తో కలిసి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఒక గొప్ప ఆలోచనతో ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఒకవేళ ఎవరికైనా కంటికి సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నట్టయితే కంటి అద్దాలు కానీ, ఇంకా అవసరమైతే ఆపరేషన్ కోసం కూడా వైద్యాధికారుల సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే కంటి వెలుగు లాంటి పథకాలు ప్రవేశపెట్టిన దాఖలాలు లేవని కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక కుటుంబ పెద్దలాగా ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న దానిపై వెంటనే గొప్ప మనసుతో ఆలోచన చేసి ఇలాంటి పథకాలు తీసుకువచ్చి ప్రజాబంధుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముద్రపడ్డారని తెలిపారు.
ప్రజల కోసం నిరంతరం ఆలోచించే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారికి తెలంగాణ ప్రజానికమంతా ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తెలిపారు.
అలాగే స్టీలు బ్యాంకు ను కూడా ప్రారంభం చేయడం జరిగిందని, స్టీల్ బ్యాంకుతో ఏర్పడే ఉపయోగాలను ప్రజలందరికీ వివరించి స్టీల్ బ్యాంకు ను ఉపయోగించేలా చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో దర్గా గ్రామ బారాస అధ్యక్షులు మైలారం శ్రీనివాస్ గారు, వార్డు సభ్యులు రేకులపల్లి నవీన్ రెడ్డి, మైలారం నాగరాజు, వర్కొలు మాధవి, ఆకారం పద్మ, బర్రె అరుణ, అంగన్వాడీ టీచర్ కల్పాక అండాలు, పంచాయతీ సెక్రెటరీ నాగరాజు, కంటి వెలుగు వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు…..