చిత్తూరు జిల్లా : డ్రగ్స్ రహిత జిల్లా కు కృషి చేద్దాం: డి ఆర్ ఓ

డ్రగ్స్ రహిత జిల్లా కు కృషి చేద్దాం: డి ఆర్ ఓ*

చిత్తూరు జిల్లా

డ్రగ్స్ రహిత జిల్లా కు కృషి చేద్దాం: డి ఆర్ ఓ*

యాంకర్ వాయిస్

డ్రగ్స్ రహిత జిల్లా కొరకు కృషి చేద్దా మని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్. రాజ శేఖర్ పేర్కొన్నారు..

శుక్రవారం డిఆర్ఓ ఛాంబర్ నందు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారి ఆధ్వ ర్యంలో డిఆర్ఓ, జడ్పీ సీఈఓప్రభాకర్ రెడ్డి తో కలిసి విద్యా శాఖ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇతర సంబంధిత అధికారులతో కలిసి డ్రగ్స్ రహిత సమా జం ఏర్పాటు కు తీసు కోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల తో సమన్వ య సమావేశం నిర్వ హించారు..

ఈ సందర్భంగా డి ఆర్ ఓ మాట్లాడు తూ ముఖ్యంగా యువత దేశాభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని,అలా కా కుండా కొంత మంది యువత మత్తు పదా ర్థాలకు బానిస అయి వారి జీవితాలను చెడు మార్గం లోనికి తీసుకొని వెళ్లడం జరుగుతున్నదని, దీని నుండి యువత ను కాపాడేందుకు అన్ని శాఖల సం బంధింత అధికా రులు కృషి చేయా లన్నారు.కాలేజీ లలో విద్యను అభ్యసించే యువత డ్రగ్స్ బారిన పడ కుండా ప్రతిప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో యాజమాన్యం పర్య వేక్షణ ఉండాలని, డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే దుష్ఫలి తాలపై వారికి అవ గాహన పెంచాలని ఇందుకు సంబంధిం చిన బ్యానర్లను పోస్ట ర్లు హోర్డింగులను ప్రతి కాలేజీలలో ఏర్పాటు చేయాలని సూచించారు..రాబోయే తరం దేశ భవి ష్యత్తుకుఅభివృద్ధికితోడ్పాటు ను అం దించేలా ఉండేలా కృషి చేయాలన్నారు. జిల్లా లోనిఅన్ని మున్సిపాలిటీలలో,
బస్టాండ్లు, రైల్వే స్టేషన్,ముఖ్య కూడ లిలలో ప్రజలకు ఈ అంశానికి సంబంధిం చిన ప్రభుత్వం చే ఆమోదించబడ్డ బ్యానర్లు,హోర్డింగ్స్ ఏర్పాటు చేయా లని తెలిపారు.పిల్లల భవిష్యత్తుపై తల్లిదం డ్రులకు ఎక్కువఆలో చనఉంటుందని, ఇటు వంటి కార్యక లాపాలకు సంబం ధించి ఎటువంటి సమాచారం ఉన్న 14500 నెంబర్ కు ఫిర్యాదుచేయవచ్చు నని తెలిపారు.

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారు అన్ని కళాశాలలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్ఫలి తాలకు సంబంధించి విద్యార్థులకు అవ గాహన పెంచాలని మరియు జిల్లాలో డ్రగ్స్ అమ్మే ప్రాంతా లు,డ్రగ్స్ జిల్లాలోకి తీసుకోని రాకుండా తీసుకోవలసిన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని మరియు ప్రధానంగా 18-21సంవత్సరాలు కలిగిన యువత, స్లామ్ ఏరియా లలో డ్రగ్స్ వాడకం పై నిఘా ను పెంచాల న్నారు.

ఈ సమావేశంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డి ఎస్ ఎఫ్ ఓ మదన్ మోహన్ రావ్,ఐ సి డి ఎస్ పిడి నాగ శైలజా, సోషల్ వెల్ఫేర్ డి డి రాజేశ్వరి, డి పి ఈ ఓ దయా సాగర్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కీర్తన,ఇతర సంబంధిత అధి కారులు పాల్గొన్నారు.